పాపన్నపేట, జూన్ 28: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి శనివారం పర్యటించారు. ముద్దాపూర్ మాజీ సర్పంచ్ దానయ్య ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చీకోడ్ మాజీ సర్పంచ్ విజయ తిరుపతిరెడ్డి కూతురు పెండ్లి ఇటీవల జరుగగా వారి గృహానికి చేరుకుని కూతురిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కొత్తలింగాయిపల్లిలో పెద్దమ్మగుడి స్లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నర్సింగ్రావుపల్లితండాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. యూసుఫ్‌పేట మాజీ సర్పంచ్ ఎరువుల దాసు కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకోగా ఆయన్ను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
బీఆర్ఎస్ గాంధారిపల్లి అధ్యక్షుడు విశ్వం తండ్రి ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుమ్మరి జగన్, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచులు గురుమూర్తి,లింగారెడ్డి,శ్రీనాథ్‌రావు, నవీన్‌గౌడ్,బద్రి మల్లేశం,నాయకులు దుర్గయ్య,కిష్టయ్య, తిరుపతిరెడ్డి,అనిల్‌రెడ్డి, గోపాల్, సాయిరెడ్డి,ఆంటోని పాల్గొన్నారు.