మెదక్ రూరల్ జూన్ 26 : హవేలిఘనపూర్ మండలంలోని వాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గుమ్మల లింగా రెడ్డి, రాజేందర్ రెడ్డి తండ్రి గుమ్మల విఠల్ రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యేపద్మదేవేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి వెంట మాజీ సర్పంచ్లు యామి రెడ్డి, సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, నాయకులు సాయ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, మ్యాకల,సాయిలు, కృష్ణ గౌడ్, మధు, సాయి రెడ్డి తదితరులు ఉన్నారు.