కుటుంబాలకు అండగా ఉంటా
బీఆర్ఎస్ నాయకుల మృతి పార్టీకి తీరని లోటని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి ఆయన వచ్చారు.
- బీఆర్ఎస్ నాయకుల మృతి తీరనిలోటు
- మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్
పుల్కల్, మే 1: బీఆర్ఎస్ నాయకుల మృతి పార్టీకి తీరని లోటని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి ఆయన వచ్చారు. గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బీరయ్య, అనిల్ ఇటీవల చనిపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామం మంచి ముగ్గురు నాయకులను కోల్పోయామన్నారు. మృతిచెందిన అనిల్‌కు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో ఆయన చలించిపోయారు.
ఆఇద్దరు పిల్లల చదువు బాధ్యతలు పార్టీ చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్ వైష్ణవి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వారికి విద్య ఫ్రీగా అందించేందుకు ఒప్పించారు. అంతకు మందు మండలంలోని బస్వాపూర్‌లో బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, విష్ణు, రైపాడ్ సర్పంచ్ రాజు,సింగూర్ మాజీ సర్పంచ్ రాజాగూడ్, కనకారెడ్డి ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

