ధాన్యాన్ని వెంటనే సేకరించాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- లారీల కొరత లేకుండా చూడాలి
- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్
పెద్దశంకరంపేట, మే 20: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే లారీలను రైస్ మిల్లులకు పంపించాలన్నారు.
రైతులు పడుతున్న ఇబ్బందులను ఫోన్లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు వివరించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ఆయ న ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్ మన్నె కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

