గజ్వేల్, ఫిబ్రవరి 19: కుర్మల ఆర్థిక సంపద పెరగాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోగా ఆలయ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. బీరప్ప దయతో తెలంగాణ పల్లెలు పచ్చని పంటలతో సస్యశ్యామలమై ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ వచ్చిన తర్వాత గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారాయని, కేసీఆర్‌తోనే గజ్వేల్ అభివృద్ధి చెందిందన్నారు. తాగు, సాగునీటి సమస్య తీరిందని చెప్పారు. విద్యుత్, రహదారులను అద్భుతంగా మార్చారన్నారు. ఒకప్పుడు మూగజీవాలకు నీళ్లు దొరకని పరిస్థితి కనిపించేదని, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎండాకాలంలో ఏ చెరువు, కుంటను చూసినా నీళ్లు ఉంటున్నాయన్నారు.
కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. ఊరూరా బీరప్ప జాతర జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. హైదరాబాద్‌లో కుర్మల ఆత్మగౌరవ భవనానికి స్థలం ఇచ్చి అద్భుతంగా నిర్మించామన్నారు. కేసీఆర్ మెదక్ జిల్లాకు, గజ్వేల్‌కు ఎంత చేశారో మీకే ఎక్కువ తెలుసన్నారు. సద్దితిన్నరేవు తలవాలని, బీరప్ప దయతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు రజిత, శ్రీనివాస్, అల్వాల బాలేష్, అత్తెల్లి శ్రీనివాస్, నాయకులు అనిల్‌కుమార్, తిరుపతిరెడ్డి, నగేశ్, టి.రాజు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు ఉడేం కృష్ణారెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, సంగుపల్లి బీరయ్య, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
గజ్వేల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావును ఆలయ నిర్వాహకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో గౌడసంఘం నాయకులు రాజాగౌడ్, అశోక్‌గౌడ్, రెగొండగౌడ్, నరేశ్‌గౌడ్, వెంకట్‌గౌడ్, రమేశ్‌గౌడ్, కల్యాణ్కర్ నర్సింగరావు, రవీందర్ పాల్గొన్నారు.
గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ మార్గంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు ర్యాలీతో శివాజీ విగ్రహం వద్దకు నిర్వాహకులు చేరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గుంటుకరాజు, గంగిశేట్టి రవీందర్, స్వామిచారి, సంతోష్‌గుప్తా, తాళ్ల నరేశ్‌గౌడ్, సంపత్గుప్తా తదితరులు పాల్గొన్నారు.