ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తారా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై దాడి యావత్తు తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. హరీశ్‌రావు ఒత్తిడి వల్లనే రైతు రుణమాఫీని ప్రభుత్వం చేసిందన్నారు. అన్ని విషయాలను ప్రజల ముందు పెడుతున్నారనే అక్కసుతోనే రాజీనామా పేరిట దాడులు చేస్తున్నారని ఆరోపించానేజ ప్రతి ఒక్క రైతుకూ రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వం వెంటబడుతామన్నారు.
రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సంపూర్ణ రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధమన్న బీఆర్ఎస్ సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించలేదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మైనంపల్లి చేసిన దాడిని ఇంకా మరిచిపోలేదని.. సిద్దిపేట ఉద్యమకారుల అడ్డా అన్నారు.