నర్సాపూర్, సెప్టెంబర్25: మైనంపల్లి హన్మంతరావు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై వాడిన భాషను మార్చుకోవాలని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమా ర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవి ఇవ్వడం కాదు.. ముందు నువ్వు మంత్రి పదవి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.
సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదన్నారు. గోమారంలో మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇం టిపై కాంగ్రెస్ నాయకులు, గూండాలు అన్యాయం గా, అకారణంగా దాడిచేయడం ఏమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే సునీతారెడ్డిని పరామర్శించడానికి, మనోధైర్యాన్ని చెప్పడానికి వెళ్తే దీనిని మైనంపల్లి రాజకీయం చేస్తూ హరీశ్‌రావు ఎందుకు వచ్చావ్ అనడం సమంజసం కాదన్నారు.
అలాంటప్పుడు నర్సాపూర్ వచ్చి నువ్వు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టావని, నీపై, మీ కార్యకర్తలపై ఏమైనా దాడి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించారు. మైనంపల్లి మాటలను నియోజకవర్గ ప్రజలు ఛీదరించుకుంటున్నారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చడంలో, అభివృద్ధి పనులు చేయడంలో మీ పనితనాన్ని చూపించాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె స్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నా రు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, కౌడిపల్లి మండల అధ్యక్షుడు రామాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.