తూప్రాన్, ఫిబ్రవరి 10 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషి, పట్టణ ప్రజల సహకారంతో తూ ప్రాన్ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్‌గౌడ్ అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు రూ. 23 కోట్ల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తూప్రాన్ పట్టణంలోని వినాయక్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రోడ్లు వెడల్పుగా ఉం డి, అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నైట్లెతే వ్యాపార, వాణిజ్య రంగాల్లో పట్టణం వేగంగా ముందుకు పోవడంతో పాటు, మోడల్ సిటీగా అవతరిస్తుందన్నారు. ప్రజలందరి సహకారంతో తూ ప్రాన్ పట్ట ణ ప్రధాన రహదారి విస్తరించిందన్నారు. చాలా ఇరుకుగా ఉండి, ఎదురుగా ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లే వీలు లేకుండా ఉన్నటువంటి వినాయక్‌నగర్ కాలనీనీ విస్తరించాలని సంకల్పించినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకే శరవేగంగా వినాయక్‌నగర్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
కొత్తగా నిర్మాణాలు చేపట్టేవారు కూడా సెట్‌బ్యాక్ వదిలి చేపట్టడం అభినందించాల్సిన విషయమని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మా మల్లేశ్, ఉమా సత్యలింగం, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, డాక్టర్ సర్గల శ్రీనివాస్, అల్లపురం సిద్ధిరాములు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.