చిన్నకోడూర్, జూన్ 6: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేశామని, నీటి వనరుల్లో వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలి ఉపాధి చూపినట్లు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. పెద్దకోడూరులో మెట్టుబండల వద్ద పెట్రోల్‌బంకును ప్రారంభించారు.
అనంతరం గోనేపల్లిలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు రూ. 5కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శంగా ముదిరాజ్ భవనం నిర్మించామని గుర్తుచేశారు. ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పెద్దమ్మ ఆలయం నిర్మించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి కృషిచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్,
గొర్రెలపెంపకందారుల ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడికాయల వెంకటేశం, జంగిటి శ్రీనివాస్, ఇట్టబోయిన శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, బట్టు లింగం, ఎల్లా గౌడ్, కొండం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లులు, మాజీ ఎంపీటీసీలు, ముదిరాజ్ సంఘం నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు