
నిజాంపేట,డిసెంబర్17:ఇతర పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సతీశ్ అన్నారు.శుక్రవారం మండలంలోని కల్వకుంటలో ఆయన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సతీశ్ మాట్లాడుతూ ఆరుతడి పంటలైన కంది, మినుములు, వేరుశనగ, సన్ఫ్లవర్ సాగు చేయాలన్నారు. అనంతరం ఆరుతడి పంటల సాగుకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణి, ఏఈవోశ్రీలత, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డ్డి, రైతులు ఉన్నారు.
ఇతర పంటల సాగు మేలు
యాసంగిలో రైతులు ఇతర పంటలను సాగు చేయాలని కౌడిపల్లి డివిజన్ ఏడీఏ బాబునాయక్ స్పష్టం చేశారు. మండలంలోని సోమక్కపేటలో రైతు పండిస్తున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యాసంగిలో వేరుశనగ, పొద్దు తిరుగుడు, పెసరతో పాటు కూరగాయలను సాగు చేయాలని సూచించారు. జనుము పంట సాగు చేస్తే ఆ పంటను పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయగానే సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద నమో దు చేసుకోవాలన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ స్రవంతిలక్ష్మణ్, ఏఈ వో స్రవంతి, రైతులు ఉషయ్య, మల్లే శం, బాలయ్య పాల్గొన్నారు.
మెదక్రూరల్లో..
యా సంగిలో రైతులు ఇతర లాభదాయక పంటల పై దృష్టి పెట్టాలని మండలవ్యవసాయ అధికారి లక్ష్మీప్రవీణ్ అన్నారు. మెదక్ మండల పరిధిలో ని మచావరం పంచాయతీలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్షీప్రవీణ్ మాట్లాడుతూ రైతులు ఇతర పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగా, పప్పుధాన్యాలు , కూరగాయలు అయిల్పామ్ పంటలు వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, రాబడిని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శరణ్య , ప్రజాప్రతినిధులు ,రైతు బంధు సమితి కోఆర్టినేటర్, రైతు బంధు సమితి సభ్యులు , రైతులు పాల్లొన్నారు.