మిరుదొడ్డి, సెప్టెంబర్ 18 : పంట రుణమాఫీ చేస్తానని మాటిచ్చి తప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి రైతులందరూ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంట రుణమాఫీ కాని 10 గ్రామాల్లోని 1000 మంది రైతులతో కలిసి తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పంట రుణమాఫీ కాని 780 మంది రైతుల జాబితాను డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం రేవంతర్‌రెడ్డి మాయమాటలు చెప్పి రైతులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పంటరుణమాఫీ కాని రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. రైతు భరోసాతోపాటు ఏ పథకం కూడా నేడు రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారుకానీ నేడు చెరువులు, కుంటలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
రైతులకు రూ.2 లక్షల పంటరుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోయి తప్పి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు తోట కమలాకర్‌రెడ్డి అన్నారు. రూ.2 లక్షల పంట రుణాలుమాఫీ చేశామని, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తన పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారంటూ మండిపడ్డారు.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నీవు జోకరుకు ఎక్కువ… లీడర్‌కు తక్కువ…నీవు హరీశ్‌రావుకు సవాల్ చేస్తా వా…? నీ తుక్కాపూర్లోనే సగం మంది రైతులకు పంట రుణమాఫీ కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంట రుణమాఫీ అయ్యే వరకు గాం ధీభవనలో కూర్చుంటావో.. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి గేటు ఎదుట కూర్చుంటావో శ్రీనివాస్‌రెడ్డి రూ.2 లక్షల పంట రుణమాఫీ కాకుంటే రైతులు నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బాల్‌రాజు, బాల్‌నర్సయ్య, రైతు విభాగం మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు లిగం, హైమద్, ఐల్లయ్య, కిష్టయ్య, మల్లయ్య, కుమార్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే మం చి గుండే. రైతులకు ఏదం టే అది ఇచ్చిండు.. మం చిగ ఆదుకుండు. గీ కాం గ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వా త ఏమీ చేస్తలేడు. నాకు పంటరుణమాఫీ కాలేదు, రైతుబంధు రాలేదు. రేవంత్‌రెడ్డి ఎందుకు వచ్చిండో తెలుస్తలేదు. కేసీఆర్ సార్ సల్లంగుండాలి. ఆయన రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించిండు. ఆయనే మళ్లీరావాలి
– కుర్మ మల్లేశం, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
బ్యాంకు నుంచి రూ.లక్షా 30మేలు పంట రుణం తీసుకున్నా నాకు పంట రుణమాఫీ రాలేదు. కాం గ్రెస్ ప్రభుత్వంలో మం త్రులు అన్నిచెబుతున్నా రే తప్పా ఏమి చేయడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రైతులకు చెప్పిన మాటలు ఉత్తయే. రూ.2 లక్షల పంటరుణమాఫీ చేస్తానని చెప్పినా నాకు మాఫీ కాలేదు. ప్రభుత్వం పోతేనే రైతులకు మేలు జరుగుతది.
– లింగాల శివారెడ్డి, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట