సంగారెడ్డి, ఆగస్టు17: ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని, రింగ్ రో డ్డుకు భూములు ఇచ్చేదిలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొండాపూర్ మండలం గిర్మాపూర్, సదాశివపేట మం డలం పెద్దాపూర్ గ్రామాల రైతులకు ఆర్డీవో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఆర్ సమావేశాన్ని బహిష్కరించి ధర్నా నిర్వహించారు. అంతకుముం దే ఆయా గ్రామాల్లో భూములు ఇవ్వమని, గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా రెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ ఇప్పటికే ఆయా గ్రామాల మీదుగా జాతీయ రహదారి, పెద్దాపూర్ ఫిల్టర్‌బెడ్, మంజీరా పైపులైన్, చెరువులు, కాల్వ ల నిర్మాణం వంటి వాటికి మా భూములు తీసుకుని కూలీలుగా మా ర్చారన్నారు. ప్రస్తుతం రెండు పంటలు పండే భూములు తీసుకుంటే మాకు ఎలాంటి జీవనాధారం లేకుండా పోతున్నదని అవేదన వ్యక్తంచేశారు. ఊరికి ఉత్తరాన మంజీరా డ్యామ్, ఫిల్టర్‌బెడ్, దక్షిణాన మల్కాపూర్ పెద్ద చెరువులు ఉన్నాయన్నారు.
వీటన్నింటి మధ్య నుం చి రింగ్రోడ్టు వేయడం రైతుల నోట్లో మట్టికొట్టడమే అవుతుందన్నా రు. ఇప్పటికే సంగారెడ్డి పక్కన ఉన్న నాందేడ్-అకోలా రోడ్డు శివంపేట నుంచి కంది ఐఐటీ వరకు జాతీయ రహదారి ఉన్నదన్నారు. ఈ రోడ్డును చింతల్పల్లికి జతచేయడంతో చింతల్‌పల్లి, తాళ్లపల్లి, కల్బ్గూ ర్, కులబ్గూర్, ఇరిగపల్లి, గిర్మాపూర్, పెద్దాపూర్‌లో భూసేకరణ మిగిలిపోతున్నదన్నారు.
ప్రభుత్వానికి కూడా బడ్జెట్ మిగులుతుందని, ఈ విషయాన్ని గుర్తించి గిర్మాపూర్-పెద్దాపూర్ నుంచి అలైన్మెంట్ మా ర్చి రైతుల విన్నపాన్ని అంగీకరించాలన్నారు.రైతుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. రైతులకు రైతు సంఘాల నాయకులు జయరాజు, పృథ్వీరాజ్, టీజేఎస్ తుల్జారెడ్డి మద్దతు ధర్నాలో గిర్మాపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం, పెద్దాపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.