2018 సంవత్సరంలో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలి. రుణమాఫీకి సం బంధించి వివరాలు గ్రామ పంచాయ తీలో ప్రదర్శించాలి .
– రైతు నర్సిపల్లి దేవయ్య, చిన్నశంకరంపేట మండలం, మెదక్ జిల్లా
పంటలోన్ ప్రభుత్వం మాఫీ చేయాలి. 2021లో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన పంట రుణమాఫీ జాబితాలో పేరు లేదు. వెంటనే పంటరుణమాఫీ చేసి న్యాయం చేయాలి.
-బౌడం వెంకటి గవ్వలపల్లి, రైతు, చిన్నశంకరంపేట మండలం, మెదక్ జిల్లా
మడూర్ యూనియన్ బ్యాం కులో 2023లో రూ.95వేల పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం విడుదల చేసిన పంట రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులు పం ట రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. స్థానిక సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు.
– రైతు మల్లేశం, చెన్నాయపల్లి, చిన్నశంకరంపేట మండలం, మెదక్ జిల్లా