దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామ శివారులోని శుభం గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్, విద్యార్థి, యూత్ విభాగాలు, బీఆర్ఎస్, అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. అంతకు ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ న్యూస్‌ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. -హుస్నాబాద్, జనవరి 29
హుస్నాబాద్, జనవరి 29: సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పోతారం (ఎస్) గ్రామ శివారులోని శుభం గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్, విద్యార్థి, యూత్ విభాగాలు, బీఆర్ఎస్ పార్టీ, అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. అంతకుముందు పోతారం(ఎస్) నుంచి శుభం గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుంబంధ సంఘాల నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని బదానాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, వీటిని ప్రజలకు వివరించడంతో పాటు సోషల్ మీడియాలో రుజువులతో సహా సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేసినట్లు ప్రజలకు వివరించాలని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోట్లా ది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతన్నప్పటికీ కొందరు కావాలనే తప్పడు ప్రచారం చేస్తున్నారని, వీరికి సరైన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సమావేశంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు మానస, మాలోత్ లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, జడ్పీటీసీలు భూక్యా మంగ, వంగ రవీందర్, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, కోహెడ పీఏసీఎస్ చైర్మన్లు పేర్యాల దేవేందర్‌రావు, రమణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరశురామ్, సోషల్ మీడియా, యూత్, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు భూక్యా రమేశ్ నాయక్, కామిరెడ్డి క్రాంతికుమార్, గంధె చిరంజీవి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ర శ్రీహరి, వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, బీలూనాయక్, ఎండీ అన్వర్, చిట్టి గోపాల్‌రెడ్డి, ఆవుల మహేందర్, పెసరు సాంబరాజు, మామిడి అంజ య్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సమ్మయ్య, ఏడు మండలాల విద్యార్థి, యూత్, సోషల్ మీడి యా అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు హాజరయ్యారు.
భవిష్యత్‌లో సోషల్ మీడియా వారియర్స్‌దే కీలక పాత్ర
మారుతున్న సాంకేతిక విజ్ఞానంతో భవిష్యత్‌లో సోషల్ మీడియా వారియర్స్ కీలక పాత్ర పోషించాల్సి వస్తున్నదని, ఇందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకొని ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని, ఫేక్ న్యూస్‌పై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబం పొందుతున్న లబ్ధిని ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లు, గ్యాస్, పెట్రోల్, రైతు వేదికలు, వైకుంఠధామాల్లో కేంద్రం వాటా ఎక్కువ ఉన్నదని బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్లపై స్పందించి నిలదీయాలన్నారు. తెలంగాణ అప్పులపై విషప్రచారం చేస్తున్నారని, కేంద్రం చేసిన అప్పులు ఎన్నో ప్రజలకు వివరించాలన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, ఎంత వరకు అమలయ్యా యో సోషల్ మీడియాలో వైరల్ చేయాలని కోరారు. బూత్ స్థాయి నుంచి మొదలుకొని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఫాలో చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని పోస్టులు పెట్టాలని సూచించారు.