కలెక్టరేట్ నుంచి తరలిన సామగ్రి
నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలోని కొమురవెల్లి, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సిద్దిపేట కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆదివారం పోలింగ్ సామగ్రిని తరలించారు.
సిద్దిపేట అర్బన్, మే 26: నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలోని కొమురవెల్లి, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సిద్దిపేట కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆదివారం పోలింగ్ సామగ్రిని తరలించారు. పోలింగ్ సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్తో ఆర్టీసీ బస్సుల్లో పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పోలింగ్లో ఆరుగురు ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు ఇతర పోలింగ్ అధికారులు, 12 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. చేర్యాల మండల కేంద్రంలో రెండు పోలింగ్ బూత్లు, కొమురవెల్లి, ధూళిమిట్ట, మద్దూర్లో ఒక్కో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఈ 4 మండలాల్లో మొత్తం 4,659 మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, ఇతర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

