రామాయంపేట, మార్చి 6: భూగర్భ జలాలు అడుగంటి బోరు మోటర్లపై ఒత్తిడి పడి కాలిపోతున్నాయని, రైతులకు విద్యుత్ సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని రామాయంపేట విద్యుత్ ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. ‘అస్తవ్యస్త కరెంట్‌తో కాలిపోతున్న మోటర్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి గ్రామాల బాట పట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
విద్యుత్ సమస్యల పరిష్కరానికి, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందితో పనులు చేయిస్తున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా ఎక్కడా విద్యుత్ సమస్య లేకుండా చేస్తామన్నా రు. వారం రోజులుగా గ్రామాలను సిబ్బంది సందర్శిస్తున్నారని, ప్రతి గ్రా మంలో వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లను సరి చేస్తున్నామని తెలిపారు. అక్కన్నపేటలోని పొలాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.