నిజాంపేట : ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకపోయినా నిజాంపేట పోలీసులు తమను అరెస్టు చేయడం ఏమిటని నిజాంపేట మండల విద్యుత్ ఆర్టిజన్లు ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాకు వెళ్తున్న తరుణంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేయడం చూశామని, కాని విధులు నిర్వహిస్తుంటే ఇలా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.
సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తే.. గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. పోలీసుల తీరుపై విద్యుత్ ఆర్టిజన్లు రాజు, ప్రవీణ్ తదితరులు తమ అసంతృప్తి తెలియబర్చారు.