 
                                                            నర్సాపూర్, మార్చి 6: నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో బుధవారం విద్యుత్ వాహనాల పోటీ (ఈ-బాజా సైండియా-2024) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు జాతీయ స్థాయిలోని ఐఐటీఎస్, నీట్ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల నుంచి 2400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి భాహా సైండియా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు సంజయ్ నిభాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్ ఇంజినీరింగ్ సీనియ ర్ వైస్ ప్రెసిడెంట్ హీరోటెక్ హరాడా, భా రత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) స్టేట్ హెడ్ అచ్మెన్ ట్రెహాన్, ఇన్నోవేషన్ హీరో మోటోకార్ప్ సీనియర్ మేనేజర్ మనీశ్ సింగాల్ తదితరులు హాజరయ్యారు.
విజేతలకు రూ.8 లక్షల నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు జట్లు పాల్గొనగా, ఈసారి మరో ఆరు జట్లు పాల్గొన్నాయని, కార్యక్రమానికి దేశంలోని అన్ని రా ష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. అనంతరం కళాశాలకు చెందిన మ హిళా ఇంజినీరింగ్ విద్యార్థులు డిజైన్ చేసి న ఆల్ టెరైన్ సింగిల్ సీటర్ ఈ-బగ్గీ వా హనాన్ని ఆవిష్కరించారు. అంతకుముం దు శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విస్సం, చైర్మన్ విష్ణు రాజు వీడియో సందేశాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజయ్ దూబే, మేనేజర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
 
                            