ప్రజలకు మేలుచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రతిఒక్కరూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి, విపక్షాల కల్లబొల్లి మాటలను తిప్పికొట్టాలన్నారు.
– చేగుంట, అక్టోబర్ 18
చేగుంట, అక్టోబర్18: ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్నే గెలుపించుకోవాలని, 60 ఏండ్లలో ఏ పార్టీ చేయని విధంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర ఏండ్లల్లో ప్రజా సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండలం వల్లూర్‌లో బుధవారం గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళనంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధితో పాటు గ్రామానికి కావాల్సిన అభివృద్ధిపై గ్రామ ప్రజలు ఎంపీకి వివరించారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున్న, ఎన్నికల తరువాత కావాల్సిన అభివృద్ధి పనులను చేసుకుందామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ పార్టీకోసం కలిసికట్టుగా పనిచేసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని పలువురు ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీ గెలిపించుకుంటామని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీశ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరీనరేశ్, ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైల రాం బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వాయిద్, మాజీ సర్పంచులు తదితరులు ఉన్నారు. అనంతరం నార్సింగి మండలం వల్లూర్‌లో దొడ్ల ఎల్లవ్వ మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.