పాపన్నపేట, అక్టోబర్ 7:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ్గాభవాని మాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం పంచమిని పురస్కరించుకుని స్కంద మాత రూపంలో పెసర రంగు పట్టు వస్త్రంతో మహాలక్ష్మీ అవతరంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
గోకుల్ షెడ్లోనూ అమ్మవారిని స్కందమాతగా పెసరరంగు పట్టు వస్త్రంతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు చేశారు. మంగళవారం వన దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.