కౌడిపల్లి, మే 23 : అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందారు. గురువారం మండలంలో పలుచోట్ల అకాల వర్షం కురిసింది. సాయంత్రం రంగంపేట, సంగాయిపేట గ్రామాల్లో గాలివానకు చెట్టు కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడడంతో స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. అకాల వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు తిప్పలు పడ్డారు.