దుబ్బాక, మే16: పండించిన ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చడం రైతులను మోసం చేయడమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు ఒకమాట..ఎన్నికల తర్వాత మరొక మాటతో కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నిలువునా ముంచిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం దుబ్బాక బస్టాండ్ వద్ద రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. యాసంగిలో రైతు లు సన్న వడ్లు పండిస్తారా అనే విషయం సీఎంకు అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వ విధానాలు గత సమైక్యంధ్ర పాలనను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. నిరసనలో జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, నాయకులు రొట్టే రాజమౌళి, కొత్త కిషన్‌రెడ్డి, గన్నే భూంరెడ్డి, వంశీకృష్ణగౌడ్, ఇల్లేందుల శ్రీనివాస్, నారాగౌడ్, బండి రాజు, బీమాసేనా, లచ్చ య్య, రవి, రాజు, నరేశ్, రైతులు పాల్గొన్నారు.