ఝరాసంగం, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం భోజ్యానాయక్ పంచాయతీ పరిధిలోని టీప్యానాయక్ తండాలో తాగునీటి ఎద్దడి ఏర్పడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తండాలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. నెల నుంచి తాగునీటికి ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు
తీసుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు.