మెదక్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్‌పై ప్రతి ఒకరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ అన్నారు. శనివారం తన ఆఫీస్‌లో క్యాన్సర్‌కు సంబంధించిన ప్లిప్ చార్ట్‌ను ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తి స్తే, చికిత్స సులభమన్నారు. ఆధునిక చికిత్సలు అందు బాటు లో ఉన్నాయని, సరియైన సయమంలో పరీక్షలు చేసుకుని క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు. దేశంలో ప్రతి ఏడు గంటలకు ఒక వ్యక్తి సర్వైకల్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారని, ప్రతి నాలుగు గంటలకు ఒక వ్యక్తి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వివరించారు. ఓరల్, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్వే లైన్స్ ఆఫీసర్ నవీన్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ గంగాధర్‌గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్సీలో హెల్త్‌కేర్ నమోదు : జిల్లా మేనేజర్ రాజు
రేగోడ్, జనవరి 7 : ఆరోగ్యశ్రీ, హెల్త్‌కేర్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన నమోదును కామన్ సర్వీస్ సెంటర్లలో చేపడుతున్నట్లు సీఎస్సీ జిల్లా మేనేజర్ రాజు పేర్కొన్నారు. రేగోడ్లోని సీఎస్సీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆరో గ్యశ్రీ, హెల్త్‌కేర్ కార్డుతో ప్రైవేట్ దవాఖానల్లో రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపారు. మొదటి విడత లో ఎంపిక చేసిన కుటుంబాలకే ఆరోగ్యశ్రీ, హెల్త్ కేర్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను ఇస్తున్నట్లు వివరిం చారు. రెండో విడతలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని సీఎస్సీల ద్వారా చేపడుతున్న ఆరోగ్యశ్రీ, హెల్త్‌కేర్ నమోదును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో సిబ్బంది శ్రీనాథ్చారి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీపీ నారాయణరెడ్డి
హవేళీఘనపూర్, జనవరి 7 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖాన అభివృద్ధ్ది కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శేరి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సర్దన ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ దవాఖానపై ప్రజల్లో ఉన్న చిన్న చూపును తొలిగించడానికి మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సర్పం చ్ సుభాశ్, వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, వైద్యాధికారి వినయ్, సుశీల్, సూపర్వైజర్లు మధన్, రమేశ్ ఉన్నారు.