నర్సాపూర్, డిసెంబర్ 9 : దివ్యాంగులు అన్ని రంగాల్లో ముం దుండాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ మాట్లాడుతూ.. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను వంద శాతం వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలపై వికాసం కేంద్ర సిబ్బంది అవగాహన కల్పిస్తారని పేర్కొ న్నారు.
పెన్షన్, సదరం సర్టిఫికెట్ లేనివారు వికాసం కేంద్రాన్ని సం దర్శించి, సిబ్బంది సహాయంతో వాటిని పొందాలని సూచించారు. నర్సాపూర్లోని వికాసం కేంద్రంలోనే దాతల సాయంతో దివ్యాంగులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మే రకు సిబ్బందిని అభినందించారు. ఏపీఎం గౌరీశంకర్ తన పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులు దీపిక, స్వాతితో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీసీలు సమత, ప్రవీణ, భాగ్య, దేవిసింగ్, రవీందర్, అకౌంటెంట్ మల్లేశం పాల్గొన్నారు.