తూప్రాన్, అక్టోబర్ 5 : సీఎం కేసీఆర్‌కు మహిళలందరూ రుణపడి ఉంటారని మల్కాపూర్ సర్పంచ్
మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.
గురువారం గృహలక్ష్మి పథకంలో ఎంపికై లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరు పత్రాలను అందజే శారు.
మొదటి విడతలో మల్కాపూర్ గ్రామంలో 56 మంది లబ్ధ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలతోపాటు
బతుకమ్మ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన చీరలను మహి ళలకు అందజేశారు. యవతకు క్రీడా
సామగ్రిని పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మల్కాపూర్ గ్రామస్తులు
క్షీరాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సమయం లో ఎవరెన్ని చెప్పినా మల్కాపూర్ ప్రజలంతా కేసీఆర్ వెంటే
ఉంటూ, గతంలో కంటే భారీ మెజార్టీ ఇస్తామని తెలిపారు.
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్,
వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ తదతరులు మహిళలకు బతుకమ్మ చీరలు, గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్
పత్రాలు అందజేశారు. మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.