ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్‌ను భాగం చేసుకోవాలి
ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్‌ను భాగం చేసుకోవాలని ఐఐటీ హెచ్ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి పిలుపునిచ్చా రు. పిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పిలుపు
కంది, మార్చి 29: ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్‌ను భాగం చేసుకోవాలని ఐఐటీ హెచ్ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి పిలుపునిచ్చా రు. పిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత్ బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై సైక్లింగ్‌ను ప్రారంభించారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు, యువకులు సుమారు వెయ్యి మంది 10కి.మీ, 20 కి.మీ సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, సైక్లింగ్, రన్నింగ్, వ్యాయామంతో ఒత్తిడి దూరమవుతుందన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడటంతో పాటు ఫిట్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్త్తాయన్నారు. పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ఫిట్నెస్ శరీరాన్ని బలపర్చడమే కాకుండా జీవిత అవకాశాలను పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని విద్యార్థులకు సూచించారు. హాప్ మారథాన్, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐఐటీ హైదరాబాద్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా డైరెక్టర్ సుశాంత్ కంద్వాల్, ఫిట్ ఇండియా అంబాసిడర్ చందనాజయరామ్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

