సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే 8లక్షలు దాటొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఈ సారీ రైతులు పత్తిపంటను వేయడానికే మొగ్గుచూపే అవకాశం ఉందని అంటున్నారు. గతేడాది 3,46,903 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా, ఈ సారి అత్యధికంగా 3,53,903 ఎకరాల్లో సాగు చేయొచ్చని, 1,41,135 ఎకరాల్లో వరి పండించొచ్చని పేర్కొంటున్నారు. కంది, సోయాబిన్, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు తదితర పంటలు సైతం సాగుచేయనున్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన 1,23,136 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు సిద్ధం అవుతున్నది. 6 వేల క్వింటాళ్ల జీలుగు, 4 వేల క్వింటాళ్ల జనపనార విత్తనాలను 40శాతం సబ్సిడీపై అందించనున్నది.
– సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ), మే
సంగారెడ్డి, మే 8 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగు పంటల సాగుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లాలో 2023 వాన కాలం 7,26,124 ఎకరాల్లో వివిధ పంటలు సాగవనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా, 2022లో జిల్లాలో 7.13 లక్షల ఎకరాల్లో రైతుల వివిధ పంటలు సాగు చేయగా, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిస్తే 8 లక్షల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు అత్యధికంగా 3,53,903 ఎకరాల్లో పత్తి పంట, 1,41,135 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. అధికారుల అంచనా మేరకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. 1,23,136 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, సబ్సిడీపై అందజేసే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పెరగనున్న పత్తి సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లాలో వాన కాలం సీజన్లో సాగు విస్తీర్ణం పెరుగనున్నది. సంగారెడ్డి జిల్లాలో 2023 వాన కాలం 7,26,124 ఎకరాల్లో వివిధ పంటలు సాగవనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా. కాగా, 2022లో జిల్లాలో 7.13 లక్షల ఎకరాల్లో రైతుల వివిధ పంటలు సాగు చేయగా, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిస్తే 8 లక్షల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు అత్యధికంగా 3,53,903 ఎకరాల్లో పత్తి పంటలను సాగు చేయనున్నారు. వరి 1,41,135 ఎకరాల్లో, కంది 82,803 ఎకరాల్లో, సోయాబీన్ 82,559 ఎకరాల్లో సాగు చేయనున్నారు. 864 ఎకరాల్లో జొన్న, 16,064 ఎకరాల్లో మొక్కజొన్న,
13,462 ఎకరాల్లో పెసర, 6516 ఎకరాల్లో మినుము, 27,268 ఎకరాల్లో చెరుకు పంటలు సాగు కానున్నాయి. రాగి 17.35 ఎకరాలు, ఆముదం 24.7 ఎకరాలు, 6.17 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7.33 ఎకరాల్లో కొర్రలు, 33.97 ఎకరాల్లో నువ్వులు, 7.41 ఎకరాల్లో వేరుశనగ, 74.1 ఎకరాల్లో ఇతర పంటలను రైతులు వానకాలంలో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటితోపాటు 592 ఎకరాల్లో మిర్చి, 543 ఎకరాల్లో ఉల్లిగడ్డ, 123 ఎకరాల్లో టమాట, 98.8 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేయనున్నారు. కాగా, గత వానకాలం సీజన్లో రైతులు 3,46,903 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సీజన్లో 3,53,903 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అంచనా. గత సీజన్ కంటే 7వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు పెరగనున్నది. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లో ఎక్కువ పత్తి సాగువుతుంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు ఉన్న సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, జహీరాబాద్, మునిపల్లి, కోహీర్, ఝరాసంగం, వట్పల్లి, రాయికోడ్ మండలాల్లో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. వానకాలం సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం 4 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా.
అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు
వానకాలం సీజన్లో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచుంది. రాబోయే వానాకాలం సీజన్లో 1,23,136 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేసి, ఆమేరకు ఎరువులను అందుబాటులో ఉంచటంతోపాటు బఫర్ స్టాక్‌ను ఉంచేందుకు సిద్ధమవుతున్నది. రైతులకు అవసరమైన పత్తి, పెసర, మినుము, వరి విత్తనాలను అందుబాటులో ఉంచుతుంది. 40 శాతం సబ్సిడీపై జీలుగు, జనపనార విత్తనాలు అందజేయనున్నారు. జీలుగ 6వేల క్వింటాళ్లు, 4వేల క్వింటాళ్ల జనపనార విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు.