చేర్యాల, ఫిబ్రవరి 26: మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించనుండడంతో కనులార వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం వేకువజామున 4గంటల వరకు 155 మంది ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పెద్దపట్నం చూ స్తూ భక్తులు శివరాత్రి జాగరణ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో శువ్రారం సాయం త్రం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ పాలక మండలి, ఈవో రామాంజనేయులు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాము లు, సురేందర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీను, చేర్యాల, కొమురవెల్లి ఎస్సైలు నిరేశ్, రాజు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.