AI Teaching | శివ్వంపేట, మార్చి 19 : శివ్వంపేట మండలం చండి, గోమారం, చిన్నగొట్టిముక్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా ఎంఈఓ బుచ్యానాయక్తో కలిసి సందర్శించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విద్యాబోధన తీరుపై ఎంఈఓ బుచ్యానాయక్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఈఓ రాధాకిషన్ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత విద్యపై మరింత అవగాహన కల్పించి, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు మెరుగైన విధంగా బోధించే విధంగా చూడాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు దాసు, రవీందర్, అంజి తదితరులు ఉన్నారు.