జిన్నారం, మే 8: అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలను రెవె న్యూ అధికారులు శుక్రవారం తొలిగించారు.
అమీన్పూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 823లో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ వెంకటేశ్ ఆదేశాల మేరకు ఆర్ఐ సంగీత జేసీబీతో కూల్చివేయించారు. సర్వేనంబర్ 993 ప్రభుత్వ భూమిలో అక్రమంగా డంప్ చేసిన మట్టి కుప్పలను చదును చేయించారు.