Siddipet | అంబులెన్స్లో ప్రసవం..తల్లి,బిడ్డ క్షేమం
Siddipet | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన సౌందర్య అనే గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే ప్రసవించింది.
రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన సౌందర్య అనే గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ ( Ambulance ) లోనే ప్రసవించింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు.
దౌల్తాబాద్ నుంచి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకు ప్రసవం ( Delivery ) చేశారు. ఆమె ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గర్భిణికి సహాయమందిచిన 108 సిబ్బంది దేవేందర్, నర్సింలుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

