మెదక్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 15 రోజుల్లో 81,304 (పురుషులు 39,175, మహిళలు 42,129) మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 10,988 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. మరో 10,302 మందికి కంటి అద్దాల కోసం రెఫర్ చేశారు. 15వ రోజు గురువారం జిల్లాలో 6562 (పురుషులు 3127, మహిళలు 3435) మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 716 మందికి కంటి అద్ద్ధాలను పంపిణీ చేయగా, 731 మందికి కంటి అద్ధాల కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ చందు నాయక్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నదని, శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శిబిరాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శిస్తున్నారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 13,800 మందికి పరీక్షలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 9 : సంగారెడ్డి జిల్లాలో 69 కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. మొత్తం 13,800 (పురుషులు 7646, మహిళలు 8238) మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1332 (పురుషులు636, మహిళలు696) మందికి అద్దాలను పంపిణీ చేశారు. 963 మందికి ప్రిస్కిప్షన్ కళ్ల అద్దాలు ఆర్డర్ చేశారు. 1523 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
పాపన్నపేట, ఫిబ్రవరి 9 : కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజార్షిషా సూచించారు. పాపన్నపేటలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రతి రోజు 200 మందికి పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. మండలంలోని 17 నుంచి 18 ఏండ్ల వయస్సున్నవారి వివరాలు ఇవ్వాలని ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డిని ఆదేశించారు. అనంతరం పాపన్నపేట శివారులో నిర్వహిస్తున్న నర్సరీని సదర్శించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మండల ప్రత్యేకాధికారి భీమయ్య, సీహెచ్వో చందర్, కోఆప్షన్ సభ్యుడు గౌస్, ఉప సర్పంచ్ బాలరాజు, ఎంపీడీవో జగదీశ్వరచారి, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి, కార్యదర్శి నయీం ఉన్నారు.