కంది, అక్టోబర్ 8: అత్యంత పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్‌ను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ రైతాంగానికి పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని కోరారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం (ఎఫ్ఆర్ఎస్)లో మంగళవారం డ్రాగన్ ఫ్రూట్ మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉద్యా న వన వీసీ పాల్గొని మేళాను ప్రారంభించారు. మేళాలో ప్రదర్శించిన 32 రకాల డ్రాగన్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్‌తో తయారు చేసిన బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్, కాస్మోటిక్స్ తదితర వాటిని తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే కేవ లం డబ్బులున్నవారే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం సామాన్యులు సైతం కొనుగోలు చేసేస్థాయికి వచ్చిందంటే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం వల్లేనని తెలిపారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పం డును మనమే ఎగుమతి చేసే స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పనికి రాని భూమిలో సైతం ఈ పంటను సాగు చేయవచ్చన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఎం తో దోహద పడే ఈ పంటను సాగు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3300 హెక్టార్లలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్నారని, మొదటి స్థానంలో రంగారెడ్డి, రెం డో స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉందన్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందుకు వచ్చే రైతాంగానికి ఉద్యాన వన శాస్త్రవేత్తలు తమ సహాయ సహాకారాలు అందిస్తారని తెలిపారు. సాగు విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యాన వన విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సుచిత్ర, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ హరికాంత్, అసిస్ట్టెంట్ ఫ్రొపెసర్ డాక్టర్ శంకర్స్వామి, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సునీత, బిఎన్ఆర్ అధినేత, డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రోత్సాహక రైతు రమేశ్‌రెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ రైతాంగ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.