అందోల్, సెప్టెంబర్ 2: ‘మాకు నష్టపరిహా రం వద్దు..భూమికి బదులు భూమే ఇవ్వా లి…చావడానికైనా సిద్ధం..భూములు మా త్రం ఇవ్వం’ అంటూ రీజినల్ రింగ్‌రోడ్డు ని ర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట ఆర్డీవో కార్యాలయం ఆవరణలో భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఆర్డీవో పాం డు అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని, తమ కు భూములే ఇవ్వాలని…అది కుదరకుంటే న్యాయమైన పరిహారం ఇవ్వడంతోపాటు ఉపాధి చూపాలన్నారు. మరికొంత మంది రైతులు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేదంటే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
మార్కెట్లో భూ ముల ధరలు కోట్లలో ఉంటే అధికారులు కేవలం రూ. 21లక్షలు చెల్లిస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరైన న్యాయం జరిగేలా చూస్తామ ని ఆర్డీవో చెప్పారు. రోడ్డు నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులకు సరైన న్యా యం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.