ములుగు, మే 31: అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రగతి తెలిపారు. ఆమె కథనం ప్రకారం… మండల కేంద్రం ములుగులోని భారతి బయో జెనిటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనుమతులు లేకుండా వివిధ కంపెనీల పేర్లతో పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్నట్లుగా గుర్తించి శుక్రవారం రాత్రి ఏడీఏ అనిల్‌కుమార్, ఎస్సై విజయ్‌కుమార్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి పత్తి విత్తనాలను, ప్యాకింగ్‌కు ఉపయోగించే 101 ఖాళీ ప్యాకెట్లను, సుమారు 8కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని, కంపెనీ యజమాని కందికట్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఏవో ప్రగతి తెలిపారు.