సంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగా ణ): ఖాకీ చొక్కాకు అవినీతి మరక అంటుతున్నది. పోలీసులు నేరస్తులతో స్నేహం చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు, అక్రమ మైనింగ్ దార్లతో జట్టుకట్టి అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్ వ్యవహారాల్లో తలదూ ర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు. భూముల విలువ అధికంగా ఉండే సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సెటిల్మెం ట్లు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను రూపుమాపేందుకు ఎస్పీ రూపేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా దాడులు చేయిస్తున్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేయిస్తున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది గంజాయి స్మగ్లర్లతో కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు తేలడం పోలీసు శాఖకు మింగుడు పడడం లేదు.
సొంత అధికారులే స్మగ్లర్లతో కలిసి పోవడం తో పోలీసు శాఖ ప్రతిష్ట దెబ్బతింటున్నది. గంజాయి స్మగ్లర్లతో జట్టుకట్టిన ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై ఇటీవల సస్పెన్షన్ వేటు పడడం అన్నివర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గం జాయి స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపాల్సిన పోలీసు అధికారులే స్మగ్లర్లతో జతకట్టి అవినీతికి పాల్పడడం విస్తుగొల్పుతున్నది. ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో పోలీ సు అధికారులు వరుసగా సస్పెన్షన్లకు గురి అవుతుండడం చర్చకు దారితీస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల గంజాయి అక్ర మ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీస్, ఎక్సైజ్ శా ఖలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల చర్యల కు గండికొట్టేలా సిబ్బం ది గంజాయి స్మగ్లర్లతో కలిసి అవినీతికి పాల్పడడం శాఖకు చెడ్డపేరు తెస్తున్నది. ఇటీవల గం జాయి అక్రమ రవాణా లో పట్టుబడిన మల్లుగోడ, మల్లేశ్ నాయక్, లకాస్ అనే నిందితులను బీడీఎల్ పోలీసులు విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మనూరు ఎస్సైగా పనిచేసి ప్రస్తు తం పటాన్చెరులో ఎస్ఐగా పని చేస్తున్న అంబారియా, వీఆర్ ఎస్సై వినయ్‌కుమా ర్, హెడ్‌కానిస్టేబుల్ మారుతినాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధు గంజాయి పట్టుకుని, స్మగ్లర్లను వదలివేసి అవినీతికి పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం ఐజీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. ఇది పోలీసు శాఖలో సంచలనంగా మారింది. జిల్లాలోని మరికొంత మంది పోలీసులకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో విఫలమయ్యారంటూ ఇటీవల సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ సీఐ, ఎస్సైలను ఐజీ సత్యనారాయణ విధుల్లోం చి తొలిగించి వీఆర్‌కు పంచించారు. ఈ ఇద్దరు అధికారులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టడంలో విఫలం కావడంతో పాటు అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో చర్య లు తీసుకున్నారు.
సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి వీఆర్‌కు వెళ్లిన ఎస్సై వినాయక్కుమార్ గంజాయి స్మగ్లర్లతో జతకట్టారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యా రు. రెండు నెలలల క్రితం వట్పల్లి ఎస్సై పోలీస్టేషన్లో ఓ ప్రజాప్రతినిధి జన్మదిన వేడుకలు నిర్వహించి హడావిడి చేయడం తో ఉన్నతాధికారులు ఆయనపై బదిలీ వేటు వేశారు. పటాన్చెరు డివిజనల్లో ఓ కేసు విషయంలో సీఐ సక్రమంగా విధులు నిర్వహించకపోవటంతో అతన్ని సస్పెండ్ చేశారు. జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది అవినీతి ఆరోపణలతో సస్పెండ్, బదిలీలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.