రామాయంపేట, మే 31 : తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ సర్కార్ మంత్రి పదవులను ఇవ్వాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కర్రె రమేశ్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎంతో మంది పార్టిలో చేరి పార్టీ నిర్ణయాల మేరకు దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మలివిడత చేపట్టబోయే మంత్రి పదవుల్లో సాధ్యమైనంత వరకు మంత్రి పదవులను కట్టబెట్టాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి పదవులు, కార్పోరేషన్ పదవుల్లో మాదిగలకు పెద్ద పీట వేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు 30 ఏండ్లు పోరాటం చేశారని ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాద్యమైందన్నారు.