అందోల్, జూన్ 25: కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి పలువురు గుడ్‌బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం సిద్దిపేటలో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు.
పొద్తునలేస్తే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు అబద్ధ్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు నమ్మరని తేలిపోయిందన్నారు. అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ అందోల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి అభద్రతా భావంతో ఉన్నారని, ఎవరినీ కదిలించినా బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే అంటున్నారన్నారు. పదేండ్ల తర్వాత అధికారం వచ్చిందనే మాటే కానీ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి ఫలితంలేదని బాధపడుతున్నారన్నారు.
కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకత వచ్చిందని, ఇక ఆపార్టీలో ఉంటే రాజకీయంగా మనుగడ కష్టమని బీఆర్ఎస్లో చేరికకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రభుత్వం అనసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విఠల్, మాజీ ఎంపీపీ అబెదాలి,వరం వైస్ చైర్మన్ తుకారంకురమ, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాజీంపాటిల్, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు లక్ష్మణ్, హనుమంతు, కృష్ణ,చంద్రశేఖర్, నాగార్జున, నాయకులు మల్లేశం, మహబూబ్ పాటిల్, సంగమేశ్వర్, శంకర్, మాణిక్యం, మౌలానా, రాజు,బస్వరాజుపాటిల్,బస్వరాజు, నరేశ్, అంజి పాల్గొన్నారు.
సిద్దిపేట,జూన్ 25: ఆపదలో ఉన్న వారికి, దవాఖానల్లో చికిత్స పొందిన వారికి ఆదుకునేందుకు ఉడుత భక్తిగా సీఎం సహాయ నిధి చెక్కులు ఆందిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 277మంది లబ్ధిదారులకు రూ.50లక్షల విలువ గల చెక్కులను ఆయన అందజేశారు. ఈకార్యక్రమంలో సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ,పాల సాయిరామ్,వేణు గోపాల్‌రెడ్డి,రాగుల సారయ్య, శ్రీకాంత్‌రెడ్డి,సోమిరెడ్డి పాల్గొన్నారు.