బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులౌతున్న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు జహీరాబాద్‌కు చెందిన ఏర్పుల నరోత్తం గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సంగారెడ్డి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. తన చేరికకు చొరవ తీసుకున్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి జూలై 6 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నరోత్తం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గురువారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో కాంగ్రెస్ నాయకుడు నరోత్తం బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఏర్పు ల నరోత్తం బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మరికొంత మంది నాయకులు బీఆర్ఎస్లోకి వలసకట్టే అవకాశాలు ఉన్నాయి. నరోత్తం జహీరాబాద్‌లోని పస్తాపూర్ గ్రామానికి చెందినవారు. 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నరోత్తం పోటీ చేశారు.
2018లో నరోత్తం టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నరోత్తం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధ్దిని చూసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమ లు ఏర్పాటు చేయడంతోపాటు సంగమేశ్వ ర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు వివరించారు. సంగమేశ్వర ఎత్తిపోతలతో జహీరాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన చేరికకు చొరవ తీసుకున్న మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నరోత్తంతోపాటు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొంత మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు
కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు నచ్చి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో అందోలు నియోజకవర్గం మునిపల్లి మండలానికి చెందిన వంద మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో నాగల్గిద్ద మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. తాజాగా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి నరో త్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన చేరికలతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైంది. ఇదిలా ఉంటే.. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఢిల్లీ వసంత్ ఈ నెల 10న మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది.