శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆర్థిక సాయం అందజేసి చేయూతనందించారు. పిల్లుట్లకు చెందిన పెద్దపులి మహేశ్ తల్లిదండ్రులకు ప్రమాదానికి గురి కావడంతో వారి దవాఖాన ఖర్చులకు రూ. 15వేలు, లింగోజిగూడ గ్రామానికి చెందిన ఎరోల్ల ప్రభాకర్ ఇటీవల గుడిసె కాలిపోవడంతో రోడున పడ్డ కుటుంబానికి గ్యాస్ సిలిండర్, నిత్యవసర సరుకులు, రూ. 5వేల నగదు అందజేసి చేయూతనందించారు.
ఈ కార్యక్రమంలో పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి , మండల నాయకులు వరాల గణేశ్, యువ నాయకులు బుర్ర మురళీగౌడ్, గ్రామ సీనియర్ నాయకులు బేస్త కిష్టయ్య, బొమ్మిడాల ప్రభు, గుల్లయ్యగారి కిష్టయ్య, బేస్త భద్రయ్య, సండ్ర లక్ష్మయ్య, గుర్రాల బాలేశ్, బండారి శ్రీనివాస్, బండారి ముత్యాలు, షేక్అలీ, రాజు, అంజి, సద్దాం, శ్రీనివాస్, బాసంపల్లి నర్సింలు, పెద్దపులి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.