సిద్దిపేట,అక్టోబర్ 10: గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని రేవంత్ సర్కారు విస్మరించిందని, జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికు లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వదే శానికి తీసుకురావాలని మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకట నలో డిమాండ్ చేశారు. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గల్ఫ్ పాలసీ తీసుకురాలేదన్నారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బికుబికుమంటూ బతుకు తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకు ని జోర్డాన్‌లో చికుకున్న 12మంది గల్ఫ్ కార్మికులను వెనకి రప్పించాలని కోరారు.
కార్మి కుల ఆవే దనను ప్రభు త్వం పట్టించుకో కపోవడం దుర్మా ర్గం అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండడం సిగ్గుచేటన్నారు.అకడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వక పోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బం దులు ఎదురొంటున్నారని, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్ వచ్చాయని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ గల్ఫ్ దేశాలకు వలస లు మొదలైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరువై తెలంగాణ బిడ్డలు ఎడారి దేశాలకు వలస వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు.
అన్నివర్గాలను మోసం చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను సైతం దారుణంగా వంచించిందని పేర్కొన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒకటీ అమలు చేయలేదన్నారు.ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ,గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లు? హరీశ్‌రావు ప్రశ్నించారు.మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డులకు అతీగతీ లేదన్నారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షే మం కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఇప్పటికీ దికులేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.