MLA Sunitha Laxma Reddy | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
MLA Sunitha Laxma Reddy | ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే సెప్టెంబర్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
నర్సాపూర్ : ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే సెప్టెంబర్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు నిరసన ( Protests ) కార్యక్రమాలు చేపడతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ( Sunitha Laxma Reddy) అన్నారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమాల విజయవంతంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు , 420 హామీలతో గద్దెనెక్కి వాటిని విస్మరించారని ఆరోపించారు. చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులతోపాటు రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ను ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మాట మార్చిందని అన్నారు.
ప్రజలను డైవర్షన్ చేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్రావును తిట్టడమే సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడని అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పెందుర్తి నుంచి శెట్టిపల్లి వరకు రోడ్డు కోసం రూ.18 కోట్లు రీ బిటి కోసం మంజూరు చేస్తే తండాలను పిలిచి అగ్రిమెంట్ చేసి, నేడు పనులను నిలిపివేసినట్లు ఆరోపించారు. రోడ్డు నిర్మించాలని కోరుతూ ఈనెల 31 న వెల్దుర్తి నుంచి శెట్పల్లి వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

