నిజాంపేట :మండల కేంద్రం నిజాంపేటలో కాంగ్రెస్ బాకీ (Congress dues ) కార్డులను బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు ( Promises ) నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమం చేపట్టామని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ ఎంపీటీసీలు బాల్రెడ్డి, వెంకటస్వామి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, మండల ఉపాధ్యక్షుడు లచ్చపేట రాములు, నాయకులు రంజిత్ గౌడ్, తిరుమల్, చంద్రయ్య, శివ తదితరులు ఉన్నారు.