చిన్నకోడూరు, జూలై 19: కేసీఆర్‌కు చెడ్డపేరు రావాలని కుట్రతోనే కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి నీళ్లివ్వకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవవహరిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతు మహా పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు 16 కిలోమీటర్లు చేపట్టిన రైతు మహా పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
లక్షల క్యూసెకుల గోదావరి జలాలు సముద్రం పాలవుతుంటే రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి గోదావరి జలాలతో అన్నపూర్ణ, రంగనాయక రిజర్వాయర్‌తో పాటు మల్లన్న సాగర్ ప్రాజెక్టులు నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని అడిగితే, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం లేదని విమర్శించారు.
కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందార్ల చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడికాయల వెంకటేశం, ఉమేశ్ చంద్ర, జంగిటి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు గుండెల్లి వేణు, బిఆర్ఎస్వీ నాయకులు రఘు, రాజశేఖర్‌రెడ్డి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.