అక్కన్నపేట, ఆగస్టు 1: ప్రభుత్వం చేపట్టిన పంటరుణమాఫీ క్షేత్ర స్థాయిలో గందరగోళంగా మా రింది. మొదట లక్ష లోపు, ఆ తర్వాత రెండో విడ త లక్షన్నరలోపు మాఫీ చేసినట్లు ప్రకటించడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేం ద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు పెద్ద సం ఖ్యలో లబ్ధిదారులు వచ్చారు.
దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీస్ కానిస్టేబుల్ రమేశ్ అక్కడికి చేరుకొని లబ్ధిదారులతో మాట్లాడి ప్రశాంతంగా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకుకు వచ్చిన వారిని క్యూలో ఉంచాడు. పంటరుణమాఫీ రైతులతో పాటు పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు రావడంతో బ్యాంకు కిక్కిరిసిందని మేనేజర్ జ్యోత్స్న తెలిపారు.