నర్సాపూర్/ శివ్వంపేట/ హత్నూర, మే 15: గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం కప్-2023’లో భాగంగా పోటీలను నిర్వహిస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం వారు నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో, శివ్వంపేట మండలం గోమారం, హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామాల్లో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణస్థాయిలో క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ క్రీడల్లో యువత భాగస్వామ్యం చేసి క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తాగునీటి, భోజన సదుపాయం కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఇదిలాఉండగా, నర్సాపూర్ వాలీబాల్ క్రీడలకు మండల వ్యాప్తంగా 16 టీంలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మండల స్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతికి రూ.5 వేలు, ద్వితీయ జట్టుకు రూ. 3వేలు, తృతీయ జట్టుకు రూ.వెయ్యి చొప్పున నజరాన అందజేస్తామని గోమారంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్ ప్రకటించారు. దౌల్తాబాద్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సర్పంచ్ వీరస్వామిగౌడ్ మజ్జిగప్యాకెట్లు పంపిణీ చేశారు.
నర్సాపూర్ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి సురేశ్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జడ్పీటీసీ బాబ్యనాయక్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంఈవో బుచ్చానాయక్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గోమారం కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గోమారం సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎంపీడీవో నవీన్‌కుమార్, ఎంపీవో తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు బాలమణినరేందర్, రాజునాయక్, చిట్యాల బాలపోచయ్య, ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్, దౌల్తాబాద్ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో స్వప్న, ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్‌లు వెంకటేశం, వీరస్వామిగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యువత అధ్యక్షుడు కిషోర్, ఎంపీడీవో శారదాదేవి, నాయకులు దుర్గారెడ్డి, సతీశ్, వెంకటేశం గుప్తా, వీరేశంగౌడ్, అజ్మత్‌అలీ, అజీస్, సాయి, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.