విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు.
- జోగిపేట ఏరియా దవాఖానను తనిఖీ చేసిన కమిషనర్
- విధులకు సరిగా హాజరుకావడంలేదని సిబ్బందిపై ఆగ్రహం
- 19 మందికి షోకాజ్ నోటీసులు
- వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
అందోల్, నవంబర్ 30: వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, హాజరు పట్టిక నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 19 మంది సిబ్బంది (వైద్యులు, వైద్యసిబ్బంది)కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే సిబ్బంది రోగులపై ప్రేమభావం కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, రికార్డులను సరిగా మెయింటనెన్స్ చేయాలని సూచించారు. జోగిపేట దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానకు వస్తారని, వారు మళ్లీ సంతోషంగా ఇల్లు చేరేలా చూసే బాధ్యత మనపై ఉంటుందన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ రమేశ్ తదితరులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

