మెదక్ రూరల్ నవంబర్ 27 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj) తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు వంటి సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని.. వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియాగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ను విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గూగుల్ ప్లే స్టోర్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu. ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని.. తమ పోలింగ్ కేంద్రం వివరాలు.. వంటివి తెలుసుకొని ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.