పువ్వులను పూజించే గొప్ప సంసృతి తెలంగాణలో ఉందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం గొప్ప విశేషమన్నారు. అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెదక్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ గొప్పదనం, పువ్వులను పూజించే గొప్ప సంసృతి తెలంగాణ ప్రజలదని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాం టి భయానికి లోను కాకుండా ఓటేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబురాలు జరుగుతాయన్నారు. ఈ బతుకమ్మ సంబరాల్లో మహిళలు బతుకమ్మలను ఒకచోట పేర్చి, చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతారని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో బీఎల్వోల పా త్ర మరువలేనిదని కొనియాడారు. స్వీప్ ఆధ్వర్యంలో ఆటలపోటీలు నిర్వహించి గెలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మ శ్రీ, ఐసీడీఎస్ పీడీ బ్రహ్మజీ, డీసీపీవో కరుణశీల, పద్మలత, డీఎస్వొ రాజిరెడ్డి, సీడీపీవో స్వరూప, ఏసీడీపీవో వెంకటరమణ, సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.